సమీక్ష : చీకటి గదిలో చితక్కొట్టుడు- సిల్లీ అడల్ట్ హారర్ కామెడీ డ్రామా

సమీక్ష : చీకటి గదిలో చితక్కొట్టుడు- సిల్లీ అడల్ట్ హారర్ కామెడీ డ్రామా

Published on Mar 22, 2019 3:32 AM IST
Chikati Gadilo Chithakotudu movie review

విడుదల తేదీ : మార్చి 21, 2019

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు : అదిత్ , హేమంత్ , నిక్కీ తంబోలి ,భాగ్య శ్రీ మోతే

దర్శకత్వం : సంతోష్ పి.జయకృష్ణ

సంగీతం : బాల మురళి

ఎడిటర్ : ప్రసన్న జి.కె.

ఇటీవల ట్రైలర్ తో సెన్సేషన్ సృష్టించిన చిత్రం చీకటి గదిలో చితక్కొట్టుడు. అడల్ట్ హారర్ కామెడీ గా తెరకెక్కిన ఈ చిత్రం ఈ రోజు ప్రేక్షకులముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ :

చందూ (ఆదిత్) పెళ్లి చూపులు కోసం వెళ్ళినపుడు అక్కడ అమ్మాయి తండ్రి కి ఆదిత్ ని తన కూతురు పూజా (నిక్కీ తంబోలి) ని తీసుకొని ఒక ట్రిప్ తీసుకెళ్లి అప్పుడు ఆమెతో పరిచయం పెంచుకోమంటాడు. అలాగే ఓ కండీషన్ కూడా పెడతాడు. ఇక దానికి చందూ కూడా ఒకే చెపుతాడు. ఆ ట్రిప్ కు తన ఫ్రెండ్ శివ (హేమంత్) ని అతని లవర్ ను కూడా రమ్మంటాడు చందూ. ఈ జంటలు సరదాగా గడపడానికి బ్యాంకాక్ కు వెళతారు. ఈక్రమంలో వారు ఉంటున్న ఇంట్లో దెయ్యం వుందని తెలుసుకుంటారు. ఆ దెయ్యం అమ్మాయిలను ఏమి చేయదు? కానీ అబ్బాయిలను మాత్రం వేధిస్తుంది? ఇంతకీ ఎవరు ఆ దెయ్యం ? దాని స్టోరీ ఏంటి ? చివరకి ఆ దెయ్యాన్ని ఎలా అంతం చేశారనే విషయాలు తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే .

ప్లస్ పాయింట్స్ :

సినిమాకు మెయిన్ ప్లస్ అంటే సెకండ్ హాఫ్ లో వచ్చే కామెడీ. టైటిల్ కు తగ్గట్లు సినిమా ని మొత్తం డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో నింపేశారు. అయితే ఫిజికల్ గా మాత్రం అసభ్యకరంగా ఏమి లేకపోవడం కూడా సినిమా కు ప్లస్సే. ముఖ్యంగా రఘుబాబు , తాగుబోతు రమేష్ దెయ్యం వున్నా ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చాక అక్కడ నుండి సినిమా హిలేరియస్ గా ఉంటుంది.

వీరితో పాటు ప్రధాన పాత్రల్లో నటించిన ఆదిత్ , హేమంత్ , నిక్కీ తంబోలి ,భాగ్య శ్రీ ల నటన కూడా బాగుంది.

మైనస్ పాయింట్స్ :

అడల్ట్ హారర్ కామెడీ తో వచ్చిన ఈ సినిమా కు మెయిన్ మైనస్ పాయింట్ అంటే స్టోరీ లేకపోవడమే. కాన్సెప్ట్ బాగున్నా దానికి తగ్గకథ , కథనాలు లేకపోవడం తో సినిమాలో సీరీయస్ నెస్ మిస్ అయ్యింది. దాంతో సినిమా అంతా చాలా సిల్లీ గా అనిపిస్తుంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ అయితే చాలా బోర్ కొట్టిస్తుంది.

అయితే సెకండ్ హాఫ్ తో కొంత నవ్వించగలిగిన మళ్ళీ క్లైమాక్స్ తో నిరాశ పరిచాడు. ఇలాంటి సినిమాలకు కామెడీ తో పాటు హారర్ కూడా చాలా అవసరం, కానీ దర్శకుడు ఓన్లీ డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఫై కాన్సంట్రేషన్ చేయడంతో సినిమాలో హారర్ మిస్ అయ్యింది.

ఇలాంటి ఒక కాన్సెప్ట్ కు కథ తో పాటు ట్విస్టులు కూడా చాలా అవసరం కానీ డైరెక్టర్ ఈ రెండు విషయాల్లో పూర్తిగా నిరాశపరిచాడు. ముఖ్యంగా దెయ్యంగా ఎందుకు మారిందో అనే రీజన్ చాలా సిల్లీ గా అనిపిస్తుంది.

సాంకేతిక విభాగం :

ఒక అడల్ట్ హారర్ కామెడీ ని డీల్ చేయడంలో దర్శకుడు పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. అక్కడక్కడా కొంచెం నవ్వించిన ప్రేక్షకులను థ్రిల్ చేయకలేకపోయాడు. ఇక మిగితా టెక్నిషి యన్స్ విషయానికి వస్తే బాలమురళి బాలు అందించిన సంగీతం యావరేజ్ గా వుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో కూడా మ్యాజిక్ చేయలేకపోయాడు.

ప్రసన్న ఎడిటింగ్ బాగుంది. సినిమాటోగ్రాఫి కూడా పర్వాలేదు. అలాగే లో బడ్జెట్ చిత్రమైన నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు :

అడల్ట్ హారర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చీకటి గదిలో చితక్కొట్టుడు లో సెకండ్ హాఫ్ లో వచ్చే కామెడీ సన్నివేశాలు హైలైట్ అవ్వగా కథ లేకపోవడం , సిల్లీ సన్నివేశాలు సినిమాకు మైనస్ అయ్యాయి. ఏ సర్టిఫికెట్ తో వచ్చిన ఈ చిత్రం యూత్ కు కూడా కనెక్ట్ అవ్వడం కష్టమే.

123telugu.com Rating : 2.5/5

Reviewed by 123telugu Team

 

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు