“అఖండ” సక్సెస్‌పై చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు ఏమన్నాడంటే?

“అఖండ” సక్సెస్‌పై చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు ఏమన్నాడంటే?

Published on Dec 17, 2021 3:00 AM IST


నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను కాంబోలో రూపుదిద్దుకున్న హ్యాట్రిక్‌ చిత్రం “అఖండ”. భారీ అంచనాల మధ్య డిసెంబర్ 2న విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తెచ్చుకుని అన్ని చోట్ల కలెక్షన్ల పరంగా దూసుకెళ్తుంది. ఈ సినిమాపై హైదరాబాద్‌లోని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ వీడియో ద్వారా స్పందించారు.

గత వారం నేను, నా సేవక బృందంతో కలిసి సినిమా చూశానని, అప్పుడే ఈ సినిమా గురుంచి చెప్పాలని అనుకున్నానని, కానీ కొన్ని కారణాల వల్ల చెప్పలేకపోయానని అన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ధర్మానికి ఎంత నష్టం జరుగుతోందో ఈ సినిమాలో ప్రత్యక్షంగా చూపించారని, ధర్మాన్ని రక్షించడం కోసం మనందరం కలిసి పోరాడాల్సిన సమయం వచ్చిందని అన్నారు. అహింసా ప్రథమో ధర్మః’ అనే వాక్యాన్ని మనకి వ్యతిరేకంగా ఎలా దుర్వినియోగం చేస్తున్నారన్నది ఈ సినిమాలో చూపించారని, ధర్మాన్ని రక్షించడం కోసం మనం ఎంతకైనా తెగించవచ్చనే సిద్ధాంతాన్ని స్పష్టంగా ఇందులో చెప్పారని అన్నారు. అందరి మనసుల్లో ఉక్రోషం, ఆక్రోషం, తపన ఉంది కానీ ఏమీ చేయలేకపోతున్నామనే బాధ, ఆందోళనకరమైనటువంటి కోపం ఉంది. మన ధర్మానికి అన్యాయం జరుగుతోంది. రామరాజ్య స్థాపన జరగాలని అందరి మనసుల్లో కోరిక ఉంది కానీ ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నామని, అందుకే ఈ సినిమా సూపర్ హిట్ అయ్యిందని అన్నారు. ఈ చిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్కరికీ భగవంతుడి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు