ప్రేక్షకాదరణ పొందుతున్న చినదాన నీకోసం

chinnadana-nikosam
యంగ్ హీరో నితిన్ నటించిన ‘చినదాన నీకోసం’ సినిమా షూటింగ్ దశను ముగించుకుని నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా జరుపుకుంటుందని 123తెలుగు మీకు ముందుగానే అందించింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ట్రైలర్ మరియు ఆడియో ప్రేక్షకాదరణ పొందాయి. అనూప్ రూబెన్స్ మరోసారి నితిన్ కి యూత్ ఫుల్, రొమాంటిక్ పాటలను అందించాడు

‘కాంచి’ అనే హిందీ సినిమాలో నటించిన మిష్టి చక్రబొర్తి ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాకు కరుణాకరన్ దర్శకుడు. ఈ చిత్రాన్ని శ్రేష్ఠ మూవీస్ బ్యానర్ పై డిసెంబర్ 19న విడుదలచేయనున్నారు

Exit mobile version