151, 152వ సినిమాల ప్లాన్స్ ఏంటో చెప్పిన చిరంజీవి !
Published on Jan 10, 2017 3:45 pm IST

chiru
మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇస్తూ చేసిన 150వ చిత్రం ‘ఖైదీ నెం 150’ రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదలకానున్న సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా సినిమాని జనాల్లోకి తీసుకెళ్లడానికి, చిత్ర విశేషాల్ని అభిమానులతో పంచుకోవడానికి చిరంజీవి నిన్నంతా వెబ్ మీడియాకు, టీవీ చానెళ్లకు చాలా ఓపిగ్గా వరుస ఇంటర్వ్యూలు ఇచ్చేశారు. ఈ ఇంటర్వ్యూల్లో ‘ఖైదీ’ గురించిన విశేషాలతో పాటు తన తదుపరి 151, 152 సినిమాలు గురించి కూడా పలు ఆసక్తికరమైన విశేషాలు తెలిపారు.

అవేమిటంటే తన 151వ సినిమా ముందుగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మించాలని అనుకున్నారని కానీ బోయపాటికి ఉన్న కమిట్మెంట్స్ వలన ప్రాజెక్ట్ లేటవుతుందని అందుకే బోయపాటితో 152వ సినిమాని చేయాలని అనుకున్నామని దాంతో చరణ్ 151వ సినిమాని కూడా తానే నిర్మిస్తానని అన్నాడని తెలిపారు. అలాగే ఆ సినిమాని ‘ధృవ’ లాంటి హిట్ సినిమా తీసిన స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి చేత చేయించాలని చరణ్ భావిస్తున్నాడని, అదింకా ఫైనల్ కాలేదని, అలాగే పరుచూరి బ్రదర్స్ తయారు చేస్తున్న ‘ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి’ స్క్రిప్ట్ కూడా చేస్తానని అన్నారు.

 
Like us on Facebook