అఫీషియల్: కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న “ఆచార్య”..!

Published on Oct 9, 2021 9:33 pm IST


మెగస్టార్ చిరంజీవి హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా సక్సెస్‌ ఫుల్‌ చిత్రాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “ఆచార్య”. ఈ సినిమాలో మెగాపవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ కూడా సిద్ద అనే కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఎన్నో అంచనాలు నెలకొల్పుకున్న ఈ మోస్ట్ ప్రెస్టేజియస్ మూవీ రిలీజ్ డేట్ అంశం గత కొన్ని రోజులుగా చర్చానీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.

అయితే తొలుత డిసెంబర్‌ 17వ తేదిన ఆచార్య సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకున్నప్పటికీ, అదే రోజు అల్లు అర్జున్ హీరోగా నటించిన “పుష్ప” రిలీజ్‌ అవుతుండడంతో ఆచార్య సినిమాను వచ్చే ఏడాదికి మార్చేశారు. 2022 ఫిబ్రవరి 4న ఆచార్య సినిమాను విడుదల చేయబోతున్నట్లు తాజాగా చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఇదిలా ఉంటే ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ మరియు మ్యాట్ని ఎంటర్‌టైన్మెంట్ పతాకంపై నిరంజన్ రెడ్డి, రామ్‌చరణ్‌ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :