చిరంజీవి సినిమాలో నటించబోతున్న సల్మాన్.. నిజమేనా?

Published on Nov 14, 2021 1:11 am IST


మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న లూసిఫర్ రీమేక్ “గాడ్ ఫాథర్” సినిమాకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి బయటకి వచ్చింది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో సల్మాన్‌ఖాన్‌ ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తుంది.

అయితే మలయాళంలో పృథ్వీరాజ్‌ సుకుమార్‌ పోషించిన పాత్రను ఇక్కడ సల్మాన్‌ఖాన్ చేత చేయిస్తే బాగుంటుందని చిత్ర బృందం భావించిందట. దీనిపై సల్మాన్‌తో చిత్ర బృందం సంప్రదింపులు జరగ్గా ఆయన కూడా సుముఖత వ్యక్తం చేశారట. అయితే దీనిపై చిత్ర బృందం ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు.

సంబంధిత సమాచారం :

More