‘మజ్ను’ ఆడియో వేడుకకు ముఖ్య అతిధిగా మెగా స్టార్

chiranjeevi
‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ, జెంటిల్ మెన్’ వంటి వరుస విజయాల తరువాత నేచ్యురల్ స్టార్ నాని చేస్తున్న చిత్రం ‘మజ్ను’. ఈ చిత్రం ఆడియో ఈరోజే విడుదలకానుంది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా రానున్నారు. చిత్ర నిర్మాత జెమిని కిరణ్ స్పెషల్ రిక్వెస్ట్ పై చిరు ఈ వేడుకకు హాజరవుతున్నారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు బాగా పెరిగాయి. గతంలో కూడా చిరు సునీల్ ‘జక్కన్న’ ఆడియో వేడుకకు ముఖ్య అతిధిగా హజారయ్యారు.

ఇప్పటికే విడుదలైన ట్రైలర్లు, పాటలు వైవిధ్యంగా ఉండటంతో సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేటైంది. ‘ఉయ్యాల జంపాల’ తో దర్శకుడిగా పరిచయమైన విరించి వర్మ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో నాని సరసన అన్ను ఇమ్మాన్యూల్, ప్రియా శ్రీ లు హీరోయిన్లుగా నటిస్తుండగా చిత్రాన్ని సెప్టెంబర్ 16న విడుదలచేయనున్నారు.