కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి న్యూఢిల్లీలోని తన నివాసంలో సంక్రాంతి పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలుగు ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకునే సంక్రాంతి పండుగ వేడుకలను కిషన్ రెడ్డి ఏర్పాటు చేయగా ఈ వేడుకలకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.
వీరిలో సినీ నటుడు, మెగాస్టార్ చిరంజీవితో పాటు యంగ్ హీరో తేజ సజ్జా కూడా ఉన్నారు. ఇక ఈ సంక్రాంతి వేడుకలకు ముఖ్య అతిథిగా దేశ ప్రదాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. ప్రదాని మోదీ చిరంజీవిని ఆప్యాయంగా పలకరించడం అందరినీ ఆకట్టుకుంది. చిరుతో కలిసి జ్యోతిప్రజల్వన చేసిన మోదీ, చిరంజీవితో చాలాసేపు ముచ్చటించారు.
ఇలా దేశప్రదాని చిరంజీవికి ప్రత్యేక మర్యాదను ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ఈ వేడుకలో చిరు పంచకట్టుతో అందరి దృష్టిని ఆకర్షించారు.