చిరు, బాలయ్య… ఏమిటా కసి !

Balakrishna Chiru

ఆరు పదుల వయసులో కూడా సినిమాల కోసం మెగాస్టార్ చిరంజీవి, మువరత్న బాలకృష్ణలు చూపిస్తున్న తపన, పడుతున్న కష్టం చూస్తే ఊరికే అయిపోతారా స్టార్ హీరోలు అనే వాఖ్యం చెప్పాలని అనిపిస్తుంది. ప్రజెంట్ చిరు తన 152వ సినిమా కోసం రెడీ అవుతుంటే బాలయ్య 105వ చిత్రం ‘రూలర్’ను విడుదలకు సిద్దం చేస్టున్నారు. ముందుగా బాలయ్య విషయానికొస్తే కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా కోసం అయన చాలానే బరువు తగ్గారు. నిన్న విడుదలైన రొమాంటిక్ లుక్ చూస్తే ఈ సంగతి స్పష్టంగా తెలుస్తుంది. బాలయ్యను అంత అల్ట్రా పోష్ లుక్లో చూసిన అభిమానులే కాదు ప్రేక్షకులు కూడా వావ్.. అంటున్నారు.

ఇక చిరు అయితే కొరటాల శివ దర్శకత్వంలో మొదలుపెట్టనున్న చిత్రంలో కొత్తగా కనబడటానికి వయసు తగ్గించే పనిలో పడ్డారు. అందుకోసం స్పెషల్ ట్రైనర్ పర్యవేక్షణలో కసరత్తులు చేస్తున్నారు. అందుకు సంబంధించిన ఫొటోలు నిన్న బయటికొచ్చాయి. వాటిని చూసిన మెగా ఫ్యాన్స్ కొత్త చిరుని చూస్తాం అంటూ సంబరపడిపోతున్నారు. ఇలా ఇద్దరు పెద్ద హీరోలు లేటు వయసులో సైతం సినిమాల కోసం కసిగా కష్టపడుతుండటం, అపారమైన క్రేజ్ ఉన్నా కూడా ప్రేక్షకులకు కొత్తదనాన్ని ఇవ్వడం కోసం పరితపిస్తుండటం నిజంగా అభినందనీయం.

Exit mobile version