‘మెగాస్టార్ – -బాబీ’ సినిమా లాంచింగ్ డేట్ అదే ?

Chiranjeevi-Bobby

మెగా అభిమానులు, మెగాస్టార్ చిరంజీవి నటించిన “మన శంకర వరప్రసాద్ గారు” (Mana Shankara Vara Prasad Garu) సినిమా సాధించిన భారీ విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. ఈ చిత్రం విడుదలైన అన్ని కేంద్రాలలోనూ బాక్సాఫీస్ వద్ద బలమైన వసూళ్లను నమోదు చేస్తూనే ఉంది. ఐతే, మరోవైపు చిరంజీవి తదుపరి ప్రాజెక్ట్‌పై అప్‌డేట్‌ల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి – బాబీ కొల్లి (Chiranjeevi-Bobby) కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతుంది. తాజా సమాచారం ప్రకారం, చిరంజీవి కెరీర్‌లో 158వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమా జనవరి 25, 2026న అధికారికంగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

అయితే, దీనిపై చిత్ర నిర్మాతల నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. రాబోయే రోజుల్లో ఈ సినిమా గురించి అన్ని విషయాల పై క్లారిటీ రానుంది. అన్నట్టు ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవిని పూర్తిస్థాయి మాస్ అవతార్‌లో చూపించనున్నారు. ఇక ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధానంగా ఉంటాయని తెలుస్తోంది. స్టోరీ కూడా ప్రత్యేకంగా ఉంటుందట. చిరును కొత్తగా చూపించాలనే ఉద్దేశ్యంతో ఈ కథ రాసుకున్నారట బాబీ.

కాగా ఈ సినిమాని KVN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాతలు వెంకట్ కె నారాయణ, లోహిత్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కాగా గతంలో చిరు, బాబీ కాంబినేషన్‌లో వచ్చిన వాల్తేరు వీరయ్య మంచి విజయం సాధించింది.

Exit mobile version