“పక్కా కమర్షియల్” ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిధిగా మెగాస్టార్..!

Published on Jun 22, 2022 10:43 pm IST

టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం “పక్కా కమర్షియల్”. అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ2 పిక్చర్స్‌, యూవీ క్రియేషన్స్‌తో కలిసి బన్నీవాసు నిర్మించిన ఈ చిత్రం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటోంది. జూలై 1న విడుదల కానున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది.

ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తేదీని ఖరారు చేసింది చిత్ర బృందం. ఈ నెల 26వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే ఈ ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి రాబోతున్నట్టుగా చెబుతూ అందుకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. ఇకపోతే ఈ సినిమాలో సత్యరాజ్ అనసూయ పాత్రలు ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని చెబుతున్నారు.

సంబంధిత సమాచారం :