చిరంజీవి మళ్ళీ కొట్టాడు!

26th, December 2016 - 09:55:26 AM

150

మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నెం 150’ రికార్డుల మోత మోగిస్తోంది. రిలీజుకు ముందే యూట్యూబ్ లో సంచలనాలు సృష్టిస్తోంది. విడుదలైన టీజర్, ప్రతి సాంగ్ అభిమానులను ఊపేస్తున్నాయి. చిరు 150వ సినిమాని ప్రకటించినప్పటి నుండి ప్రేక్షకుల్లో నెలకొన్న భారీ అంచనాలకు, చిరు రీ ఎంట్రీ కోసం అభిమానుల్లో ఎంతగా ఎదురుచూస్తున్నారు అనే అంశాలకు ఈ రికార్డులే నిదర్శనంగా నిలుస్తున్నాయి. తాజాగా మొన్న శనివారం విడుదలైన రెండవ పాట ‘సుందరి’ ఒక్క రోజుకే 2.18 మిలియన్ల వ్యూస్ దక్కించుకుని కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.

ఈ పాటతో దేవి శ్రీ ప్రసాద్ మరోసారి తన మ్యాజిక్ ను రిపీట్ చేశారు. ఈ పాట తాలూకు విజువల్స్ లో చిరంజీవి చాలా యంగ్ గా, ఉత్సాహంగా కనిపిస్తుండటంతో పొంగిపోతున్న అభిమానులు సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయమనే ధీమాని వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే నిన్న సాయంత్రం విడుదల కావాల్సిన ఈ చిత్ర పూర్తి స్థాయి ఆడియో వాయిదా పడింది. చిత్ర టీమ్ కానీ, లహరి మ్యూజిక్ సంస్థ గాని వాయిదాకు గల కారణాలను స్పష్టంగా తెలుపలేదు.