నదుల రక్షణ కోసం నడుం బిగించిన చిరు


‘నదులను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత’ అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. యోగి సద్గురు జగ్గి వసుదేవ్ సమక్షంలో జరుగుతున్న”ర్యాలి ఫర్ రివర్స్” కు ఆయన మద్దతు తెలిపారు. వీడియో సదేశంలో మాట్లాడుతూ ‘మన నదులు తరతరాలుగా మనల్ని కాపాడుతున్నాయి. ప్రస్తుతం వాటిని కాపాడాల్సిన భాద్యత మనది. నదులు రోజురోజుకు తరిపోతున్నాయి. మనం వీటి గురించి కేర్ తీసుకోకపోతే, త్రాగడానికి కూడా నీరు దొరకదు. కాబట్టి నదుల రక్షణలో నాతోపాటు చేతులు కలపండి, ‘ర్యాలి ఫర్ రివర్’లో పాల్గొనండి’ అంటూ కోరారు.

కాగా, ప్రస్తుతం చిరంజీవి తన 151వ చిత్రంగా రాబోతున్న ‘సైరా నరసింహరెడ్డి’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించగా, కొణిదెల ప్రొడక్షన్స్ పై రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు.