పవన్ కోసం అన్నయ్య చిరు? క్లారిటీ ఇదే

ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న సినిమాలకు కాస్త విరామం ఇచ్చి పొలిటికల్ పనుల్లో బిజీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ కోసం తన కుటుంబీకులు కదిలారు. నిన్ననే యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో వరుణ్ తేజ్ పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురం లో ప్రచారం మొదలు పెట్టగా మెగా అభిమానులు మరింత మంది స్టార్ హీరోలు మెగా కుటుంబం నుంచి వస్తారని చూస్తున్నారు.

అయితే గత కొన్ని రోజులు కితం నుంచి పవన్ అన్నయ్య టాలీవుడ్ మెగాస్టార్ కూడా రాబోతున్నారు అని పలు రూమర్స్ వచ్చాయి. అయితే వీటిపై లేటెస్ట్ గా మరో అన్నయ్య నాగబాబు క్లారిటీ ఇచ్చారు. సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ లు అయితే వస్తారని కానీ అన్నయ్య చిరు వస్తారో లేదో ఇంకా తెలీదని తెలిపారు. ప్రస్తుతం చిరు “విశ్వంభర” షూటింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చిరు రావచ్చు రాకపోవచ్చు అనే హింట్ ని అయితే నాగబాబు అందించారు.

Exit mobile version