సాయి పల్లవి పై మెగాస్టార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ !

Published on Sep 19, 2021 8:44 pm IST

అక్కినేని నాగచైతన్య – సాయి పల్లవి “లవ్ స్టోరి” అన్ ప్లగ్ డ్ ఈవెంట్ పాల్గొన్న మెగాస్టార్ చిరంజీవి.. సాయి పల్లవి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. చిరు మాటల్లోనే.. ‘సాయి పల్లవిని ఫిదా సినిమాలో చూసే దాకా ఆమె ఎవరో తెలియదు. ఫిదాలో సాయి పల్లవి టైమింగ్, డాన్స్ టాలెంట్, ఎనర్జీ చూసి ఎవరీ అమ్మాయి అని ఆశ్చర్యపోయాను. వరుణ్ వచ్చి ఎలా చేశాను డాడీ అని అడిగితే, సారీరా నేను నిన్ను చూడలేదు, సాయి పల్లవిని చూశాను అని చెప్పాను. నా సినిమాలో సాయి పల్లవి సోదరి క్యారెక్టర్ చేయాల్సింది. కానీ ఆమె నో చెప్పింది, నాక్కూడా సాయి పల్లవితో బ్రదర్ క్యారెక్టర్ లో నటించాలని లేదు. ఆమె లాంటి వండర్ ఫుల్ డాన్సర్ తో హీరోగా డాన్సులు చేయాలని ఉంది.

నాతో అప్పట్లో రాధ, శ్రీదేవి పోటాపోటీగా డాన్సులు చేసేవారు. వాళ్లతో డాన్స్ చేస్తుంటే ఛాలెంజింగ్ గా ఉండేది. చైతూ కూడా సాయి పల్లవితో డాన్స్ చేసేప్పుడు ఇబ్బంది పడే ఉంటాడు. మీ ఇద్దరి కాంబినేషన్ విజువల్ ఫీస్ట్ గా ఉండాలని కోరుకుంటున్నా. ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందని ఖచ్చితంగా చెప్పగలను. సారంగ దరియా సాంగ్ కోసమైనా “లవ్ స్టోరి” సినిమా రెండు మూడు సార్లు చూస్తాను; అంటూ మెగాస్టార్ చెప్పుకొచ్చారు.

ఇక మెగాస్టార్ సినిమా ఇండస్ట్రీ పరిస్థితులు గురించి మాట్లాడుతూ.. ‘మొన్న కరోనా టైమ్ లో ఇండస్ట్రీలో కార్మికులు పనిలేక అల్లాడిపోయారు. వాళ్లకు మేమంతా కలిసి నిత్యావసర వస్తువులు అందించి, ఆదుకున్నాం. ఇదే కాదు ఏ విపత్తు వచ్చినా ముందుగా స్పందించేది సినిమా తారలు అని చెప్పేందుకు గర్వపడుతున్నాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా పరిశ్రమను ఆదుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ముందుకు రావాలని వినమ్రంగా కోరుతున్నా’ అన్నారు.

సంబంధిత సమాచారం :