హలో అనబోతున్న మెగాస్టార్ చిరంజీవి !

Published on Dec 18, 2017 8:45 pm IST

విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నాగార్జున నిర్మాతగా తెరకెక్కుతున్న హలో సినిమాలో అఖిల్‌కు జోడీగా కళ్యాణి ప్రియదర్శన్ నటిస్తోంది. అనూప్‌రూబెన్స్ మ్యూజిక్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా డిసెంబర్ 22న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇదివరుకు విడుదలైన ఈ సినిమా ట్రైలర్, పాటలకు మంచి స్పందన లభిస్తోంది.

ఈ సినిమాతో అఖిల్ హిట్ కొట్టబోతునట్లు నాగార్జున కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. తాజాగా హలో యూనిట్ యు ఎస్ లో ప్రమోషన్స్ చేసింది. ఈ నెల 20 న హైదరాబాద్ లో భారీగా ప్రీ రిలీజ్ ఫంక్షన్ చెయ్యబోతున్నారు చిత్ర యూనిట్. ఈ వేడుకకు చిరంజీవి ముఖ్య అతిథిగా రాబోతున్నాడు. చిరంజీవి, నాగార్జున మద్య ఉన్న సాన్నిహిత్యం అందరికి తెలిసిందే.

సంబంధిత సమాచారం :

X
More