మరోసారి గొప్పమనసు చాటుకున్న చిరంజీవి.. అభిమాని కూతురి పెళ్లికి ఆర్థిక సాయం..!

Published on Feb 1, 2022 11:30 pm IST

మెగాస్టార్ చిరంజీవి కేవలం సినిమాల పరంగానే కాకుండా ఇండస్ట్రీలో, అభిమానుల్లో ఎవరికి ఏ ఆపద వచ్చినా సాయం చేస్తూ ఆదుకుంటుంటాడు. అయితే మరోసారి చిరంజీవి తన గొప్ప మనసును చాటుకున్నాడు. తన వీరాభిమాని కూతురి పెళ్లికి ఆర్థిక సాయం అందించాడు.

వివరాల్లోకి వెళితే రాజం కొండలరావు అనే వ్యక్తి చిరంజీవికి వీరాభిమాని. ఇటీవలె ఆయన కూతురు నీలవేణి పెళ్లి కుదిరింది. అయితే తన అభిమాని ఆర్థిక ఇబ్బందులు ఎదురుకుంటున్నాడని తెలుసుకున్న చిరంజీవి వెంటనే అతడికి లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని అందించారు. కాగా ఈ విషయాన్ని చిరంజీవి అభిమానుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు రవణం స్వామినాయుడు సోషల్‌ మీడియా వేదికగా తెలియచేశాడు.

సంబంధిత సమాచారం :