మరోసారి కష్టాలో ఉన్న పావలా శ్యామలను ఆదుకున్న చిరంజీవి..!

Published on May 18, 2021 10:00 pm IST

కరోనా మహమ్మరి కారణంగా షూటింగ్‌లు లేక ఎంతో మంది సినీ ఆర్టిస్టులు తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక సీనియర్ ఆర్టిస్టుల సంగతి అయితే మరీ దయనీయంగా మారింది. అయితే మూవీ ఆర్టిస్టుల సంఘంలో స‌భ్య‌త్వం ఉన్న సీనియ‌ర్ ఆర్టిస్టుల‌కు నెల‌కు రూ.6 వేల చొప్పున పెన్షన్ మరియు ఇన్సూరెన్స్ వంటి సదుపాయాలను కూడా కలిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే గతంలో అనేక సినిమాల్లో నటించిన సీనియ‌ర్ న‌టీమ‌ణి పావ‌ల శ్యామ‌ల ఇప్పుడు ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదురుకుంటున్నట్టు తెలుస్తుంది.

అయితే గతంలో పావలా శ్యామ‌ల స‌రైన ఉపాధి లేక తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న‌ప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఆమెకు రూ. 2 ల‌క్ష‌ల రూపాయలను కుమార్తె శ్రీ‌జ చేతుల‌ మీదుగా సాయం అందించారు. అయితే ఇప్పుడు కూడా ఆమె ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకున్న చిరంజీవి మా త‌ర‌పున స‌భ్య‌త్వ‌ కార్డ్ నిమిత్తంగా 1,01,500 రూపాయలను అందించారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఈసీ స‌భ్యులు క‌రాటే క‌ళ్యాణి, సురేష్ కొండేటి ఈ చెక్‌ను స్వ‌యంగా పావలా శ్యామలకు అందించారు. దీంతో మా మెంబ‌ర్ షిప్ కార్డ్ ద్వారా పావలా శ్యామలకు నెల‌కు రూ.6 వేల చొప్పున ప్రతినెలా పెన్షన్ అందించడం జరుగుతుంది. అయితే ఇలాంటి కష్ట కాలంలో పావ‌ల‌శ్యామ‌ల‌ను ఆదుకునేందుకు ముందుకొచ్చి మా కార్డు నిమిత్తం కొరకు లక్షా పదిహేను వందల రూపాయలు ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి గారికి మా కమిటీ స‌భ్యులు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

ఈ సందర్భంగా పావ‌లా శ్యామ‌ల మాట్లాడుతూ గతంలో తాను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు చిరంజీవి గారు అందించిన రూ. 2 లక్షల రూపాయలు నన్ను ఎంతో ఆదుకుందని ఆయన చేసిన మేలును ఎప్పటికి మరిచిపోలేనని, ఇప్పుడు ఈ క‌ష్టంలో మ‌రోసారి లక్షా పదిహేను వందల రూపాయలు చెక్ రూపంలో ఇచ్చి ప్రతి నెలా ఆరువేల రూపాయలు సాయం అందించేందుకు సాయ‌ప‌డ్డారని మ‌న‌స్ఫూర్తిగా చిరంజీవి గారికి నా ధ‌న్య‌వాదాలు తెలియచేస్తున్నానని అన్నారు.

సంబంధిత సమాచారం :