మెగాస్టార్‌ను వర్ణించడానికి మాటలు సరిపోవట్లేదట!

16th, October 2016 - 12:08:48 PM

khaidi-150
మెగాస్టార్ చిరంజీవి చాలాకాలం తర్వాత వెండితెరకు రీ ఎంట్రీ ఇస్తూ ‘ఖైదీ నెం. 150’ అనే సినిమాతో మెప్పించేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. సంక్రాంతి కానుకగా జనవరి నెలలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటూ వస్తోంది. ఇక ప్రస్తుతం హైద్రాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో చిరంజీవి, లక్ష్మి రాయ్‌లపై ఓ స్పెషల్ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారు. చిరు స్టైల్ మాస్ బీట్‌తో ఈ సాంగ్‌ తెరకెక్కుతోంది. ఇక ఈ సందర్భంగా చిరంజీవితో కలిసి ఒక పాటలో డ్యాన్స్ చేయడం అద్భుతంగా ఉందని రాయ్ లక్ష్మి తెలిపారు.

ఒక నిజమైన లెజెండ్‌తో, జెమ్ లాంటి వ్యక్తితో, గోల్డ్ అనదగ్గ స్టార్‌ అయిన చిరంజీవితో కలిసి స్పెషల్ సాంగ్‌కు డ్యాన్స్ చేయడం చెప్పలేని అనుభూతి అని, చిరంజీవి గురించి చెప్పడానికి తనదగ్గర మాటలు కూడా లేవని లక్ష్మి రాయ్ తన ఆనందాన్ని పంచుకున్నారు. వీవీ వినాయక్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఖైదీ నెం. 150ని చిరు తనయుడు రామ్ చరణ్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. తమిళంలో ఘన విజయం సాధించిన ‘కత్తి’కి రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది.