‘వాల్తేరు వీరయ్య’ లానే ‘కాకా’లో కూడా ఇదే కోర్ హైలైట్!?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఇప్పుడు తన బ్లాక్ బస్టర్ వాల్తేరు వీరయ్య దర్శకుడు కొల్లి బాబీతో చేస్తున్న కాకా కోసం అందరికీ తెలిసిందే. మంచి అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా అతి త్వరలో పూర్తి కాబోతోంది. అయితే ఈ సినిమాలో యంగ్ హీరోయిన్ అనస్వర రంజన్ మెగాస్టార్ కూతురు పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే.

అయితే దర్శకుడు బాబీ ఈ ట్రాక్ తోనే మంచి సెంటిమెంట్ ని పండించబోతున్నాడు అని తెలుస్తోంది. గత సినిమా వాల్తేరు వీరయ్య లో మాస్ మహారాజ రవితేజతో అన్నదమ్ముల ట్రాక్ లో ఎమోషన్ ఎలా వర్కవుట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. అలానే ఈసారి తండ్రీ కూతుర్ల కోర్ ఎమోషన్ నే సినిమాని నిలబెడుతుంది అని తెలుస్తోంది.

సో ఈసారి బాబీ టేకింగ్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే కే వి ఎన్ సంస్థ నిర్మాణం వహిస్తున్న ఈ సినిమ గ్రాండ్ గా సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కాబోతోంది.

Exit mobile version