‘భోళా శంకర్’ లాంగ్ షెడ్యూల్ రెడీ !

Published on Oct 18, 2021 1:00 am IST

టాలెంటెడ్ డైరెక్టర్ మెహ‌ర్ రమేష్ మెగాస్టార్ చిరంజీవితో ‘వేదాళం’ రీమేక్ ‘భోళా శంకర్’ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా లాంగ్ షెడ్యూల్ ను ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. వచ్చే వారం నుంచి ఈ షెడ్యూల్ మొదలుకానుందని తెలుస్తోంది. ఇక మెగాస్టార్ తన కెరీర్ లో ‘భోళా శంకర్’ పాత్ర కోసం పూర్తి డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నారు. ఆ మధ్య చిరు గుండు లుక్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.

ఆ లుక్ ఈ సినిమాలోదే. అలాగే ఈ సినిమాలో మరో క్రేజీ లుక్ కూడా ఉందట. ఆ లుక్ పూర్తి డిఫరెంట్ గా ఉంటుందట. కాగా మెహ‌ర్ ర‌మేష్ ఈ సినిమా స్క్రిప్ట్ ను బాగా డిజైన్ చేశారట. ముఖ్యంగా కథలోని మెయిన్ ఎమోషన్స్ అద్భుతంగా వచ్చాయట. ఇక ఈ సినిమాలో చిరుకి చెల్లిగా కీర్తి సురేష్ నటిస్తోంది. ఇక హీరోలను స్టైలిష్ గా చూపించడంలో మెహర్ రమేష్ కి మంచి టాలెంట్ ఉంది. మరీ మెగాస్టార్ ను మెహర్ రమేశ్ ఎంత కొత్తగా చూపిస్తాడో చూడాలి.

సంబంధిత సమాచారం :

More