ఏషియన్ సునీల్ కుమార్తె వెడ్డింగ్ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్ గా మెగా బ్రదర్స్

Published on Jun 23, 2022 11:30 pm IST

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత నారాయణ్ దాస్ నారంగ్ పలు సినిమాలు నిర్మించడంతో పాటు పలు ఇతర సినిమాలకు ఎగ్జిబిటర్ గా, ఫైన్షియర్ గా, అలానే డిస్ట్రిబ్యూటర్ గా కూడా వ్యవహరించారు. ఇటీవల ఆయన మరణాంతరం ఆయన తనయుడు సునీల్ నారంగ్ కూడా తండ్రి బాటలోనే అదే బ్యానర్ పై ప్రస్తుతం సినిమాలు నిర్మిస్తున్నారు. అయితే సునీల్ నారంగ్ కుమార్తె జాన్వీ నారంగ్ వివాహం, ఇటీవల ఆదిత్యతో నిశ్చయం అయింది. ఇక నేడు వీరిద్దరి వివాహ వేడుక హైదరాబాద్ లో ఎంతో వైభవోపేతంగా జరుగుతోంది.

ఇక వీరి వివాహానికి కోలీవుడ్ నుండి యువ నటుడు శివ కార్తికేయన్, మరియు ఇతర నటులతో పాటు టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తోపాటు మరికొందరు ప్రముఖులు విచ్చేయగా కొద్దిసేపటి క్రితం టాలీవుడ్ స్టార్ బ్రదర్స్ మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ఈ వివాహ మహోత్సవానికి కలిసి వచ్చారు. ఇక వీరిద్దరూ వచ్చిన వెంటనే అక్కడి ప్రాంగణం మొత్తం కూడా ఒక్కసారిగా ఫోటోగ్రాఫర్స్ తో కిక్కిరిపోయింది. వారికి సునీల్ ఎంతో సాదరంగా ఆహ్వానం పలికారు. అనంతరం కొద్దిసేపటికి నూతన వధూవరులైన జాన్వీ, ఆదిత్యలను చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఆశీర్వదించారు. కాగా ఈ వివాహానికి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన చిరు, పవన్ ల ఫోటోలు, వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతున్నాయి.

సంబంధిత సమాచారం :