మాజీ సీఎం రోశయ్య మరణం పట్ల చిరు దిగ్భ్రాంతి.!

Published on Dec 4, 2021 11:59 am IST


ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మరో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ రాజకీయ నాయకులు మరియు మాజీ ముఖ్యమంత్రిగా వ్యవహరించినటువంటి కొణిజేటి రోశయ్య గారు ఈరోజు తన తుది శ్వాస విడిచారు అనే వార్త సినీ మరియు రాజకీయ ప్రముఖులను దిగ్భ్రాంతికి లోను చేసింది.

ఈరోజు ఉదయం ఒక్కసారిగా బీపీ డౌన్ కావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేర్చి వైద్యం మొదలు పెట్టే లోపే తన తుది శ్వాస విడిచారని తెలిసింది. అయితే ఈ వార్త విన్న మెగాస్టార్ చిరంజీవి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

“మాజీ గవర్నర్,మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య గారి మృతి తీరని విషాదం . ఆయన రాజకీయాలలో భీష్మాచార్యుడి వంటి వారు.ప్రజా జీవితంలో రోశయ్య గారు ఒక మహోన్నత నేత. రాజకీయ విలువలు, అత్యున్నత సంప్రదాయాలు కాపాడడం లో ఆయన ఓ రుషిలా సేవ చేశారు. వివాదరహితులుగా, నిష్కళంకితులుగా ప్రజల మన్ననలు పొందిన వ్యక్తి రోశయ్యగారు. ఆయన కన్నుమూయడంతో రాజకీయాలలో ఓ శకం ముగిసింది. రోశయ్య గారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.” అని తెలిపారు. మరి వారి పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని మా 123తెలుగు యూనిట్ కూడా ఆకాంక్షిస్తుంది.

సంబంధిత సమాచారం :