ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత జి.వి. నారాయణరావు కన్నుమూత పట్ల మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు. 1976లో ‘అంతులేని కథ’ చిత్రంతో వెండితెరకు పరిచయమైన నారాయణరావు, పలు సినిమాలు మరియు టెలివిజన్ సీరియళ్ల ద్వారా నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారని చిరంజీవి గుర్తు చేసుకున్నారు.
తనతో నారాయణరావుకు ఉన్న సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ.. ఆయన నిర్మాణంలో వచ్చిన ‘దేవాంతకుడు’, ‘యముడికి మొగుడు’ వంటి హిట్ చిత్రాల జ్ఞాపకాలను పంచుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ, నారాయణరావు కుటుంబ సభ్యులకు, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత, నా ఆత్మీయ మిత్రుడు జీవీ నారాయణరావు గారు ఇక లేరనే వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
1976లో ‘అంతులేని కథ’ చిత్రంతో వెండితెరకు పరిచయమైన ఆయన, ఎన్నో చిత్రాల్లోనూ, పలు టెలివిజన్ సీరియళ్లలోనూ తన విలక్షణమైన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక… pic.twitter.com/6yBSvnqmEf
— Chiranjeevi Konidela (@KChiruTweets) August 27, 2026
