‘విశ్వక్ సేన్’ భలే సమాధానం చెప్పాడు – మెగాస్టార్

‘విశ్వక్ సేన్’ భలే సమాధానం చెప్పాడు – మెగాస్టార్

Published on Feb 10, 2025 12:00 AM IST

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘లైలా’ ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 14న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయ్యింది. రామ్ నారాయణ్ దర్శకత్వంలో సాహు గారపాటి నిర్మించిన ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి విచ్చేశారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ మాట్లాడుతూ.. ‘మొన్న ఓ ఈవెంట్ లో అడిగిన ప్రశ్నకు ‘విశ్వక్ సేన్’ భలే సమాధానం చెప్పాడు. మీరు బాలకృష్ణ కాంపౌండ్ కదా… మరి చిరంజీవి వైపు వచ్చారేంటి అని ప్రశ్నిస్తే… మా ఇంటికి కాంపౌండ్ ఉంది కానీ, ఫిలిం ఇండస్ట్రీకి కాంపౌడ్ లేదు అని చక్కగా బదులిచ్చాడు’ అని చిరు చెప్పారు.

మెగాస్టార్ ఇంకా మాట్లాడుతూ.. ‘విశ్వక్ సేన్ ఆ విధంగా సమాధానం చెప్పినందుకు అభినందిస్తున్నాను. మనుషులన్నాక వేరే వాళ్లపై అభిమానం, ప్రేమ ఉండకూడదా? నాపై ఆప్యాయత, అనురాగం ఉండకూడదా?, మా ఇంట్లోనే చూసుకుంటే మా అబ్బాయికి సూర్య అంటే చాలా ఇష్టం. అంతమాత్రాన వాడి ఫంక్షన్ కు నేను వెళ్లకూడదా, వాడితో కలిసి ఉండకూడదా, వాడితో కలిసి భోంచేయకూడదా ?, సినిమా వాళ్ళు బాగానే ఉంటారు కానీ, అభిమానులు కొట్టుకుచస్తారని అర్థమైంది. నేను హీరోని అయ్యాక హీరోల మధ్య సఖ్యత, సుహృద్భావ వాతావరణం ఉండాలనే కోరుకున్నాను’ అని చెప్పారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు