రానా కోసం చిరంజీవి, సూర్య !


హీరో దగ్గుబాటి రానా ప్రస్తుత సినిమాల్లో ‘ఘాజి’ కూడా ఒకటి. భారదేశ చరిత్రలో 1971 లో ఇండియా – పాక్ ల మధ్య మొట్ట మొదట జరిగిన జలాంతర్గామి యుద్ధం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కిన ఈ చిత్రం పట్ల ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. పైగా కరణ్ జోహార్ బాలీవుడ్ లో ఈ సినిమానై డిస్ట్రిబ్యూట్ చేస్తుండటం వలన కూడా ఈ చిత్రం ఖచ్చితంగా అందరినీ మెప్పిస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఇకపోతే ఈ సినిమాలో ముఖ్యమైన ఓవాయిస్ ఓవర్ చెప్పడానికి ఇద్దరు స్టార్ హీరోలు ముందుకొచ్చారని సమాచారం.

వాళ్ళే మెగాస్టార్ చిరంజీవి, సూర్య. చిరంజీవి తెలుగులో వాయిస్ ఓవర్ చిరంజీవి ఇవ్వనుండగా, సూర్య తమిళంలో మాటలు అందివ్వనున్నారట. ఇదే గనుక జరిగితే రానా సినిమాకి మంచి ప్రమోషన్ లభించినట్లవుతుంది. కానీ ఈ విషయంపై ఇంకా అధికారిక సమాచారం విడుదల కావాల్సి ఉంది. పివిపి సంస్థ నిర్మించిన ఈ చిత్రాన్ని దర్శకుడు సంకల్ప్ రెడ్డి డైరెక్ట్ చేయాగా ఇందులో సినిమాలో తాప్సి హీరోయిన్ గా నటింస్తోంది. ఫిబ్రవరి 17న ఈ చిత్రం భారీ స్థాయిలో విడుదలకానుంది.