అనుక్షణం అభిమానులకు కృతజ్ఞుడిగా ఉంటా – మెగాస్టార్

Published on Oct 17, 2021 10:32 pm IST

కరోనా విపత్కర పరిస్థితుల్లో మెగాస్టాన్‌ చిరంజీవి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్‌ బ్యాంకుల్ని స్థాపించి విశేష సేవలందించారు. ఐతే, ఆ ఆక్సిజన్‌ బ్యాంకుల నిర్వహణలో అభిమానుల సేవలు గర్వకారణమంటూ మెగా అభిమానుల‌కు చిరు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ..కరోనా సమయంలో ఎంతోమందికి ధైర్యం ఇచ్చాం. ఆస్పత్రులకు తరలించి మంచి వైద్యం అందించే ప్రయత్నం చేశాం. కాకపోతే ముగ్గురు అభిమానుల్ని కాపాడలేకపోవడం దురదృష్టం’ అంటూ చిరు ఎమోషనల్ గా చెప్పారు.

అనంతరం మెగాస్టార్ తన అభిమానుల సేవలను మెచ్చుకుంటూ.. ‘అభిమానులటంతా పెద్ద మనసుతో సేవ చేశారు. నన్ను అర్థం చేసుకుని అందరూ సేవా కార్యక్రమాల్లో భాగం అయ్యారు. నా సేవలో మీరు అంతా సైనికులుగా ఉన్నందుకు నేను నా అదృష్టంగా భావిస్తున్నాను. అనుక్షణం అభిమానులకు కృతజ్ఞుడిగా ఉంటాను’ అంటూ చిరు చెప్పుకొచ్చారు.

సంబంధిత సమాచారం :

More