మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర’ చిత్రాన్ని సమ్మర్ రిలీజ్‌కు రెడీ చేస్తున్నాడు. ఈ సినిమాను దర్శకుడు వశిష్ఠ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ మూవీపై అంచనాలు నెక్స్ట్ లెవెల్‌లో నెలకొన్నాయి. ఇక ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఇప్పటికే రిలీజ్ అవగా ప్రేక్షకుల నుంచి సాలిడ్ రెస్పాన్స్ దక్కింది. ఈ సినిమా తర్వాత చిరు తన నెక్స్ట్ చిత్రాలను వరుసగా ఓకే చేస్తూ అభిమానుల్లో ఆసక్తి పెంచుతున్నారు.
ఇప్పటికే యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తో చిరంజీవి తన నెక్స్ట్ చిత్రాన్ని అనౌన్స్ చేశారు. ఈ సినిమాలో చిరంజీవిని సరికొత్త పాత్రలో శ్రీకాంత్ చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక మరో డైరెక్టర్ అనిల్ రావిపూడి తో కూడా చిరు ఓ సినిమా చేయనున్నారు. అయితే, ఇప్పుడు మరో డైరెక్టర్ బాబీతో కూడా చిరంజీవి సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సంక్రాంతి కానుకగా ‘డాకు మహారాజ్’ చిత్రంతో భారీ సక్సెస్ అందుకున్నాడు ఈ డైరెక్టర్. ఈ సినిమాలో బాలయ్యను సరికొత్తగా ప్రజెంట్ చేశాడు బాబీ.
దీంతో మరోసారి ఈ డైరెక్టర్‌తో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడట చిరు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ అనే సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు మరోసారి చిరంజీవి కోసం బాబీ ఓ సాలిడ్ కథను రెడీ చేస్తున్నాడని.. దీనికి సంబంధించిన లైన్‌ను చిరుకి వినిపించాడని.. ఆయన కూడా ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే టాక్ వినిపిస్తోంది. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.