ఇక దానిపై ఫోకస్ పెట్టనున్న మెగాస్టార్..?

Vishwambhara

మెగాస్టార్ చిరంజీవి తన లేటెస్ట్ చిత్రం “మన శంకరవర ప్రసాద్ గారు”తో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన స్టామినా నిరూపించారు. గ్రాండ్ ఓపెనింగ్‌తో థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం అన్ని చోట్ల అద్భుతమైన వసూళ్లను రాబడుతూ దూసుకెళ్తోంది. ముఖ్యంగా చిరంజీవి వింటేజ్ ఎనర్జీ, స్టైల్, కామెడీ టైమింగ్ తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటూ సినిమాకు బలమైన మౌత్ టాక్ తీసుకొచ్చాయి.

ఇక ఈ సినిమాకు సాలిడ్ రెస్పాన్స్ రావడంతో చిరు చాలా సంతోషంగా ఉన్నారు. కాగా, ఇప్పుడు ఆయన తన దృష్టిని పూర్తిగా తన నెక్స్ట్ భారీ చిత్రం “విశ్వంభర”పైకి మళ్లించనున్నారు. వీఎఫ్‌ఎక్స్ పనుల ఆలస్యం కారణంగా ఏడాదికి పైగా వాయిదా పడిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. కొంత బ్రేక్ తర్వాత చిరంజీవి స్వయంగా వీఎఫ్‌ఎక్స్ పనులను పర్యవేక్షిస్తూ, టీమ్‌తో కలిసి వాటిని రీచెక్ చేసి, రిలీజ్ డేట్‌ను ఖరారు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా, ఫిబ్రవరి నుంచి ప్రారంభం కావాల్సిన బాబీ సినిమా షూట్ ప్రీ-ప్రొడక్షన్ కారణంగా ఆలస్యం అవుతుండటంతో చిరంజీవి ప్రస్తుతం “విశ్వంభర”పైనే పూర్తి ఫోకస్ పెట్టనున్నారట. వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సోషియో-ఫాంటసీ చిత్రంలో త్రిష హీరోయిన్‌గా నటిస్తుండగా, యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది.

Exit mobile version