స్టార్ డైరెక్టర్ కి ‘సైరా’ స్పెషల్ షో !

Published on Sep 10, 2019 7:45 pm IST

మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రుపొందుతున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా విడుదల కానుంది. ఈ సినిమా కోసం మెగా అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే సినీ పరిశ్రమలోని కొంతమందికి సైరా స్పెషల్ షోను వేయాలనే ఆలోచనలో ఉందట చిత్రబృందం. ముఖ్యంగా స్టార్ డైరెక్టర్ రాజమౌళికి ప్రత్యేకంగా త్వరలో స్పెషల్ షో వేయనున్నారని తెలుస్తోంది. రాజమౌళి నుండి సినిమాకి సంబంధించి విలువైన సలహాలను సూచనలను తీసుకోవాలని సైరా మేకర్స్ భావిస్తున్నారట.

కాగా ఈ సినిమాలో సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, అనుష్క వంటి స్టార్ లు కూడా నటిస్తున్నారు. అందుకే సైరా కోసం తెలుగు ప్రేక్షకులే కాకుండా.. హిందీ, కన్నడ మరియు తమిళ ప్రేక్షకులు కూడా సినిమా పై ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుంది. భారీ బడ్జెట్ తో హీరో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో కూడా భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.

సంబంధిత సమాచారం :

X