పునీత్‌ పార్థివ దేహానికి నివాళులర్పించిన చిరు, వెంకటేశ్‌, శ్రీకాంత్..!

Published on Oct 30, 2021 5:59 pm IST

కన్నడ సూపర్‌స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ నిన్న గుండె పోటుతో మరణించగా ఆయనను కడసారి చూసేందుకు సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు, పెద్ద ఎత్తున అభిమానులు బెంగళూరులోని కంఠీరవ స్టేడియకు వస్తున్నారు. అయితే తాజాగా టాలీచుడ్ ప్రముఖ హీరోలు చిరంజీవి, వెంకటేశ్‌, శ్రీకాంత్, కమెడీయన్ అలీ బెంగుళూరుకు వెళ్లి పునీత్‌ పార్దివ దేహానికి నివాళులు అర్పించారు.

అనంతరం వారి కుటుంబసభ్యులకు మనోధైర్యం చెప్పారు. పునీత్‌ రాజ్‌కుమార్‌ మృతిని జీర్ణించుకోలేకపోతున్నానని, చిన్న వయసులోనే పునీత్‌ మనల్ని వదిలి వెళ్లడం బాధాకరమని, ఆయన మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటు అని అన్నారు. పునీత్‌ మరణం తీరని లోటన్న వెకటేశ్, శ్రీకాంత్‌, అలీ అన్నారు.

సంబంధిత సమాచారం :