మెగా విక్టరీ మాస్‌గా చిరు-వెంకీ మల్టీస్టారర్ సాంగ్.. అదిరిపోద్ది సంక్రాంతి..!

MSG 3 1

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ నుంచి మేకర్స్ తాజాగా ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాలో చిరంజీవితో పాటు క్యామియో రోల్ చేస్తున్న విక్టరీ వెంకటేష్ ఒక మాస్ సాంగ్‌లో చిందులేస్తున్నట్లు ఇప్పటికే మేకర్స్ వెల్లడించారు. తాజాగా ఈ సాంగ్‌కు సంబంధించిన లిరికల్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు.

ఇక ఈ సాంగ్ గురించి మేకర్స్ చెబుతున్నట్లుగా ఇది పక్కా మాస్ అండ్ బీట్ సాంగ్‌గా ప్రేక్షకులను అలరించేలా ఉంది. మెగాస్టార్ చిరంజీవితో కలిసి వెంకటేష్ చేసిన డ్యాన్స్ ప్రేక్షకులకు అదిరిపోయే ట్రీట్ ఇవ్వడం ఖాయంగా అనిపిస్తుంది. ఇక కాసర్ల శ్యామ్ అందించిన లిరిక్స్‌కు భీమ్స్ క్యాచీ ట్యూన్స్‌తో ఈ పాట ఇద్దరు హీరోల అభిమానులకు ఫీస్ట్‌లా మారింది.

ఈ సాంగ్‌లో వెంకీ గురించి చిరు అడగడం.. బాస్ గురించి వెంక అడగడం.. రెండు కూడా క్యాచీ లైన్స్‌తో సాగాయి. మొత్తానికి ఓ సాలిడ్ క్యాచీ అండ్ మాస్ సాంగ్.. కాదు.. మెగా విక్టరీ మాస్ సాంగ్‌తో ప్రేక్షకులకు థియేటర్లలో పూనకాలు తెప్పించేందుకు మెగాస్టార్ చిరంజీవితో పాటు విక్టరీ వెంకటేష్ రెడీ అయినట్లు ఈ పాట చూస్తే అర్థమవుతోంది. ఇక ఈ సినిమాను అనిల్ రావిపూడి తనదైన ఫార్మాట్‌తో తెరకెక్కిస్తూ సినిమాపై అంచనాలు పెంచారు. స్టార్ బ్యూటీ నయనతార ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుండగా సాహు గారపాటి, సుష్మిత కొణిదెల ప్రొడ్యూస్ చేస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version