విడుదల తేదీ : జనవరి 12, 2025
123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5
నటీనటులు : చిరంజీవి, వెంకటేష్, నయనతార, కేథరిన్ థెరిసా, సచిన్ ఖేడేకర్, హర్షవర్ధన్, అభినవ్ గోమఠం, సుదేవ్ నైర్, మాస్టర్ రేవంత్ మరియు ఇతరులు
దర్శకుడు : అనిల్ రావిపూడి
నిర్మాణం : సాహు గారపాటి, సుస్మిత కొణిదెల
సంగీతం : భీమ్ సిసిరోలియో
ఛాయాగ్రహణం : సమీర్ రెడ్డి
కూర్పు : తమ్మిరాజు
సంబంధిత లింక్స్ : ట్రైలర్
ఈ సంక్రాంతి కానుకగా ప్లాన్ చేసిన సాలిడ్ ఎంటర్టైనర్ చిత్రాల్లో ఫ్యామిలీ ఆడియెన్స్ లో విపరీతమైన బజ్ ని నమోదు చేసిన అవైటెడ్ చిత్రం “మన శంకర వరప్రసాద్ గారు” (Mana Shankara Varaprasad Garu) కూడా ఒకటి. దర్శకుడు అనీల్ రావిపూడి మెగాస్టార్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ మొదటి సినిమా ఎలా ఉందో ఫ్యామిలీ ఆడియెన్స్ లో మళ్ళీ అనీల్ రావిపూడి హిట్ కొట్టాడో లేదో ఈ సమీక్షలో చూద్దాం రండి.
Mana Shankara Varaprasad Garu కథ:
భారతీయ సెక్యూరిటీ ఏజెన్సీలో ఛీఫ్ సెక్యూరిటీ అడ్వైజర్ శంకర వరప్రసాద్ (చిరంజీవి) ఒక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కూడా ఇలా తనకి పరిచయం అయ్యిన ఓ పేరు మోసిన బిజినెస్ మ్యాగ్నెట్ జీవిఆర్ గ్రూప్స్ కంపెనీ అధినేత్రి శశిరేఖ (నయనతార) తో మాట లేకుండా జరిగిన పరిచయం పెళ్లి వరకు వెళ్ళిపోతుంది. కానీ ఆమె తండ్రి (సచిన్ ఖేడేకర్) మాత్రం ప్రసాద్ ని శశిరేఖ, పిల్లలు నుంచి విడదీస్తాడు. మరి వీరి విడాకులకు గల అంత బలమైన కారణం ఏంటి? మళ్ళీ వరప్రసాద్ ఎలా వారి కుటుంబంలోకి ఎంటర్ అయ్యాడు? అక్కడ తనకి పోటీకి వచ్చిన మైనింగ్ మొఘల్ వెంకీ గౌడ (వెంకటేష్) ఎంట్రీ తర్వాత ఎలా మారింది. ఈ క్రమంలో సస్పెండెడ్ పోలీస్ వీరేంద్ర పాండే (సుదేవ్ నైర్) ఎందుకు శశిరేఖ, పిల్లలని చంపాలని చూస్తాడు అనేవి తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూసి తెలుసుకోవాల్సిందే.
ప్లస్ పాయింట్స్:
దర్శకుడు అనీల్ రావిపూడి మీద ఒక మీమ్ లాంటిది ఉంటుంది. ‘నేను మీకు దొరకనురా’ అని అది నూటికి నూరుపాళ్లు నిజమే అని ఈ సినిమా చూసిన ఆడియెన్స్ కి ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఇద్దరు సీనియర్ సూపర్ స్టార్స్ ని తన చేతికిచ్చి ఒక సాలిడ్ ఎంటర్టైనర్ తీయమని ఫ్రీడమ్ ఇస్తే ఎలా ఉంటుందో అందుకు కావాల్సిన సామాగ్రి అంతా కూడబెట్టి ఈ సంక్రాంతికి ఇళ్లలో చేసుకునే కలగూర తరహాలో ప్యాకెడ్ ఎంటర్టైనర్ తాను చేసి పెట్టారని చెప్పొచ్చు.
సినిమా ఆద్యంతం ఎక్కడా బోర్ లేకుండా మంచి ఎంటర్టైనింగ్ గా వెళ్లిపోతూనే ఉంటుంది. ఇక మెగాస్టార్ నుంచి చాలా కాలంగా మిస్ అవుతున్న వింటేజ్ కామెడీ అండ్ మాస్ వైబ్స్ ని ఇందులో దర్శకుడు పర్ఫెక్ట్ గా ప్రెజెంట్ చేశారు. మెగాస్టార్ స్వాగ్ గాని ఎమోషన్స్ గాని ముఖ్యంగా కామెడీ టైమింగ్ ఇందులో అదిరిపోయాయి. అంతే కాకుండా అనీల్ రావిపూడి మార్క్ ఆసనాలు, ప్రతిజ్ఞలు లాంటివి కూడా థియేటర్స్ లో భళే పేలుతాయి.
ఫస్టాఫ్ లో అయితే సాలిడ్ హిలేరియస్ సీక్వెన్స్ లు ఒకదాని తర్వాత ఒకటి పడుతూనే ఉంటాయి. మీరు నవ్వుకోండి అన్నట్టు అనీల్ డిజైన్ చేసి ఆడియెన్స్ మీదకి వదిలేసారు. మరీ ముఖ్యంగా బుల్లిరాజు (మాస్టర్ రేవంత్) ఎపిసోడ్స్ అయితే మరో లెవెల్లో వర్కౌట్ అయ్యాయి. ఇలా ఫస్టాఫ్ తర్వాత సెకండాఫ్ లో కూడా సాలిడ్ ఎంటర్టైన్మెంట్ అండ్ మిగతా ఎమోషన్స్ కూడా బ్యాలన్స్డ్ గా దర్శకుడు తీసుకెళ్లిన విధానం ఇందులో మెప్పిస్తుంది.
ముఖ్యంగా వెంకీ మామ తెరపైకి వచ్చిన తర్వాత నుంచి సినిమా ఎండింగ్ వరకు అలా పికప్ అయ్యి వెళ్ళిపోయింది. ఇక మెగాస్టార్ అండ్ వెంకీ మామ ఇద్దరి మీద వచ్చిన ప్రతీ సీన్ హైలైట్ అంతే.. ఒకరి పాటకి ఒకరు డాన్స్ లు ఒకరి డైలాగ్ లు ఒకరు చెప్తూ ఉంటే ఆ ఫీల్ థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయాల్సిందే. ఇక వెంకీ మామ కూడా తన రోల్ లో చాలా హ్యాండ్సమ్ అండ్ డైనమిక్ గా కనిపించారు.
వీరితో పాటుగా నయనతార రోల్ కూడా చాలా బాగుంది. తన పాత్రలో వెయిట్ క్యారీ అవుతూ సినిమా మొత్తం వెళుతుంది. తన రోల్ లో నయన్ బాగా చేశారు. ఇక కొంచెం నెగిటివ్ అండ్ ఫన్ టచ్ లో సచిన్ ఖేడేకర్ రోల్ కూడా అనీల్ రావిపూడి మార్క్ ఎక్స్ ప్రెసెన్స్ తో వర్కౌట్ అవుతాయి. వీరితో పాటుగా క్యాథరిన్, హర్షవర్ధన్ ఇంకా అభినవ్ లో మెగాస్టార్ తోనే ఆద్యంతం ఉంటూ తమ రోల్స్ లో బాగా చేశారు. అలాగే వారికీ చిరుకి నడుమ కామెడీ సీన్స్ ఎంటర్టైన్ చేస్తాయి. వీరితో పాటుగా నటి జరీనా వాహబ్ కూడా బాగా చేశారు. తనకి నయన్ కి నడుమ ఓ ఎమోషనల్ సీన్ బాగుంది.
మైనస్ పాయింట్స్:
టాలీవుడ్ ఆడియెన్స్ లో ఒకో దర్శకుని సినిమా అంటే కొన్ని కొన్ని అంశాలు పక్కన పెట్టేయాలని ఆడియెన్స్ కి ఒక క్లారిటీ ఉంది. అలానే అనీల్ రావిపూడి సినిమాల విషయంలో కూడా కథ పరంగా పెద్దగా ఆశించకూడదు అనే క్లారిటీ కూడా ఉంటుంది.
సో అలానే ఇందులో కూడా అంత బలమైన కథ లేదు. మనం చూసిన తెలిసిన లైన్ లోనే ఇది కూడా కనిపిస్తుంది. సో కొన్ని సీన్స్ అక్కడక్కడా రొటీన్ ఫీల్ కలిగిస్తాయి. అలాగే సెకండాఫ్ లో కొంచెం డ్రాగ్ అనిపిస్తుంది. కానీ తర్వాత సెట్టవుతుంది. అలాగే మెగాస్టార్ తో అనీల్ చాలా వరకు కామెడీ పండించారు కానీ ఇంకా తనలోని కామెడీ టైమింగ్ ని తోడుకొని ఉంటే బాగుండు.
సాంకేతిక వర్గం:
ఈ చిత్రంలో నిర్మాణ విలువలు డీసెంట్ గా ఉన్నాయి. సినిమాకి కావాల్సిన సెటప్, ప్రొడక్షన్ డిజైన్ బాగానే చేసుకున్నారు. ఇక భీమ్స్ సాలిడ్ వర్క్ అందించాడు కొన్ని తన మార్క్ ఫోక్ సాంగ్స్ కూడా సెపరేట్ గా అందించాడు. అలాగే సాంగ్స్ ఆల్రెడీ హిట్, బాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా అందించాడు. కావాల్సిన సీన్స్ ని తన స్కోర్ తో ఎలివేట్ చేసాడు. కెమెరా వర్క్ డీసెంట్ గా ఉంది. తమ్మిరాజు ఎడిటింగ్ కూడా బాగానే ఉంది సెకండాఫ్ లో కొంచెం కేర్ తీసుకోవాల్సింది. అలాగే ఫైట్ సీక్వెన్స్ లు చాలా బాగా ప్లాన్ చేశారు. మెగాస్టార్ పై స్టైలిష్ టేకింగ్ అదిరింది.
ఇక దర్శకుడు అనీల్ రావిపూడి పనితనంకి వస్తే.. పైన చెప్పిన విధంగానే తన వర్క్ మాత్రం గత సినిమాలతో పోలిస్తే చాలా బెటర్ అని చెప్పొచ్చు. కథ పరంగా పక్కన పెట్టేస్తే.. తన కథనం మాత్రం బాగా ప్లాన్ చేసుకున్నారు. ఎక్కడా బోర్ లేకుండా ప్లాన్ చేసుకున్న సీక్వెన్స్ లు అన్నీ వర్కౌట్ అవుతాయి. ముఖ్యంగా తన గత సినిమాల విషయంలో వినిపించే క్రింజ్ అనే కామెంట్స్ కి ఇందులో తావు ఇవ్వలేదు. ఆ రేంజ్ లో సర్ప్రైజ్ చేస్తాడు తాను. అలాగే ఫ్యామిలీ ఆడియెన్స్ టార్గెట్ గా డిజైన్ చేసుకున్న సన్నివేశాలు గాని డైలాగ్స్ గాని వారికి యిట్టె కనెక్ట్ అయ్యే విధంగా డిజైన్ చేయడంలో తన రైటింగ్ టీం ఎఫర్ట్స్ కనిపిస్తాయి. భార్య, భర్తలు వారి మధ్య స్పర్థలు వచ్చాక జరిగే పరిణామాలపై కామెడీ యాంగిల్ లోనే కాకుండా ఎలా సర్దుకుపోవాలి అనే పాయింట్ ని కూడా డీసెంట్ గా చెప్పారు. దానికి తోడు కావాల్సినంత ఫన్ అందించడం బోనస్..
తీర్పు:
ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే పండగకి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ (Mana ShankaraVaraPrasad Garu). తమ కోసం థియేటర్స్ కి వచ్చిన ఆడియెన్స్ ని ఏమాత్రం డిజప్పాయింట్ చేయకుండా పంపుతారు. హిలేరియస్ గా సాగే సాలిడ్ కామెడీ ఎపిసోడ్స్ అన్ని వర్గాల ఆడియెన్స్ ని థియేటర్స్ లో అలరిస్తాయి. మెగాస్టార్ నుంచి కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ పుష్కలంగా ఉన్నాయి. అదే విధంగా వెంకీ మామ ఎపిసోడ్స్ అయితే ఆడియెన్స్ కి బోసన్. ఇక ఇద్దరి కాంబినేషన్ లో సీన్స్ అయితే ట్రీట్ గా నిలుస్తాయి. వీటిని మించి అనీల్ రావిపూడి వర్క్ బ్యాలన్స్డ్ గా ఉంది. ఇవే కాకుండా బ్యూటిఫుల్ ఎమోషన్స్ తో కూడిన ఈ చిత్రంని ఈ పండుగకి థియేటర్స్ లో చూసి ఎంటర్టైన్ అవ్వొచ్చు.
123telugu.com Rating: 3.25/5
Reviewed by 123telugu Team
