మెగాస్టార్ తో వెంకీ.. ఫుల్ ఎంటర్ టైనర్ అట !

Published on Nov 22, 2021 7:06 am IST

మెగాస్టార్ చిరంజీవి కోసం యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుముల ఒక ఫుల్ ఎంటర్ టైన్మెంట్ తో సాగే కథను రాశాడని.. ఇప్పటికే చిరుకు కథను కూడా వివరించాడని, కథ చిరుకి బాగా నచ్చిందని తెలుస్తోంది. ఎలాగూ మెగాస్టార్ కంటిన్యూగా సినిమాలు చేసుకుంటూ పోతున్నారు కాబట్టి, వెంకీ కథను కూడా ఓకే చేసి ఉంటారనే రూమర్ వైరల్ అవుతుంది.

మెగాస్టార్ ప్రస్తుతం ‘ఆచార్య’, ‘గాడ్ ఫాదర్, భోళాశంకర్’ లాంటి వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అలాగే బాబీ దర్శకత్వంలో సినిమాని కూడా స్టార్ట్ చేయనున్నాడు. ఆ తర్వాత వెంకీ కుడుముల సినిమా ఉండే ఛాన్స్ ఉందట. ‘ఛలో, భీష్మ’ లాంటి వరుస హిట్స్ తో వెంకీకి మంచి గుర్తింపు వచ్చింది.

ఏది ఏమైనా చిరు రీఎంట్రీ ఇస్తూ వరుస సినిమాలు ఒప్పుకుంటున్న నేపథ్యంలో చాలామంది డైరెక్టర్లు మెగాస్టార్ కోసం కొత్త కథలు రాయడం మొదలెట్టారు. ఇప్పటికే చిరుకు కొంతమంది లైన్స్ కూడా చెప్పినట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :

More