మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్రిష హీరోయిన్ గా దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న అవైటెడ్ విజువల్ ట్రీట్ చిత్రం “విశ్వంభర” కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ జనవరి నుంచి వాయిదా పడిన ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ పెద్దగా రాలేదు. మరి ఫైనల్ గా మేకర్స్ చిరుపై ఓ మాస్ ఇంట్రో సాంగ్ చేస్తున్నట్టుగా సాలిడ్ పోస్టర్ ని చిరుపై వదలగా అది మెగా అభిమానుల్లో కొత్త ఎనర్జీ తీసుకొచ్చింది.
అయితే దీనితో పాటుగా వశిష్ట చేసిన పోస్ట్ ఇపుడు వైరల్ గా మారింది. చిరు పంచె కట్టుకున్న లుక్ వెనుక నుంచి రివీల్ చేసి ఈ సొంగ్ లో చిరు ఎనర్జీ, స్వాగ్ లు అదిరిపోయాయి అంటూ ఈ సాంగ్ పై మరింత హైప్ ఎక్కిస్తున్నారు. దీనితో తన పోస్ట్ వైరల్ గా మారింది. ఇక ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అలాగే ఈ యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.