‘గ్యాంగ్ లీడర్’ కి రెండు రెట్లు అందంగా ‘వాల్తేరు వీరయ్య’ లో మెగాస్టార్ కనిపిస్తారు – నిర్మాత రవిశంకర్

‘గ్యాంగ్ లీడర్’ కి రెండు రెట్లు అందంగా ‘వాల్తేరు వీరయ్య’ లో మెగాస్టార్ కనిపిస్తారు – నిర్మాత రవిశంకర్

Published on Dec 28, 2022 3:00 AM IST


మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో శృతి హాసన్ హీరోయిన్ గా రూపొందుతున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ మూవీ వాల్తేరు వీరయ్య. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ మూవీలో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, బాబీ సింహా, మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలు చేసారు. ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజ్ అయిన మూడు సాంగ్స్ అందరినీ ఎంతో ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచాయి. ఇక నేడు ఈ మూవీ యొక్క మీడియా మీట్ ని హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీ లో నిర్వహించారు యూనిట్ సభ్యులు.

ఈ సందర్భంగా నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ మాట్లాడుతూ, మూవీ కోసం మెగాస్టార్ చిరంజీవి గారు మొదలుకొని లైట్ బాయ్ వరకు ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడి పని చేసారని అన్నారు. మెగా ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరూ మెగాస్టార్ ని ఎప్పటి నుండో ఎలాగైతే చూడాలని అనుకుంటున్నారో పక్కాగా అదే విధంగా అద్భుతంగా దర్శకుడు బాబీ ఈ మూవీ కథ, కథనాలని సిద్ధం చేసి తెరకెక్కించారని అన్నారు. మెగాస్టార్ తో పాటు మాస్ మహారాజా రవితేజ కూడా ఈ సినిమాలో వర్క్ చేయడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. రాక్ స్టార్ డిఎస్పీ సూపర్ మ్యూజిక్ అందించారని, కొన్నేళ్ల క్రితం వచ్చిన గ్యాంగ్ లీడర్ మూవీలో చిరంజీవి ఎంత అందంగా ఉన్నారో, అంతకు మించి రెండింతలు అందంగా మా వాల్తేరు వీరయ్యలో కనిపిస్తారని, తప్పకుండా సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కానున్న వాల్తేరు వీరయ్య బాక్సాఫీస్ బద్దలు కొట్టడం ఖాయం అని ఆయన అభిప్రాయపడ్డారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు