
మెగాస్టార్ చిరంజీవి బ్యాక్ టూ బ్యాక్ సినిమాలను సెట్ చేసి పెట్టుకున్నారు. ప్రజెంట్ కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ చిత్రంలో నటిస్తున్న ఆయన తర్వాత చేయాల్సిన మూడు సినిమాలను ఫైనల్ చేసుకున్నారు. ఆ చిత్రాలను వివి.వినాయక్, మెహర్ రమేష్, బాబీలు డైరెక్ట్ చేయనున్నారు. వినాయక్ ‘లూసిఫర్’ రీమేక్ కు దర్శకత్వం వహించనుండగా మెహర్ రమేష్ ‘వేదాళం’ రీమేక్ హ్యాండిల్ చేయనున్నారు. ఇక బాబీ చేయబోయేది రీమేక్ కాదని, ఫ్రెష్ స్టోరీ అని తెలుస్తోంది.
ప్రజెంట్ ఈ ముగ్గురూ స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నారు. అయితే ఈ ముగ్గురిలో ఎవరి సినిమా ముందుగా పట్టాలెక్కుతుంది అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇనస్త్రీ వర్గాల టాక్ మేరకు ఏ దర్శకుడైతే ముందుగా తన స్క్రిప్ట్ తో చిరును సంతృప్తి పరుస్తారో వారి సినిమానే మొదలయ్యే అవకాశం ఉందట. మోస్ట్లీ మొదట వినాయక్ తర్వాత మెహర్ రమేష్, ఆ తర్వాత బాబీ సినిమాలు టేకాఫ్ అయ్యేలా ఉన్నాయి. ఏదేమైనా వచ్చే ఏడాది చిరు నుండి ‘ఆచార్య’ కాకుండా ఒకటి లేదా రెండు సినిమాలను ఆశించవచ్చట.
ఇక చిరు ఎంచుకున్న దర్శకుల జాబితాను చూస్తే ఇంకో రెండేళ్లు ఆయన ప్రయోగాల జోలికి వెళ్లకుండా పూర్తిగా కమర్షియల్ ఫార్మాట్లోనే సినిమాలు చేయాలని డిసైడ్ అయినట్టు స్పష్టంగా అర్థమవుతోంది. మెగా అభిమానులు సైతం చిరు నుండి మాస్ మసాలా ఎంటెర్టైన్మెంట్లనే ఎక్కువగా ఆశిస్తుంటారు. అలాంటి సినిమాలకు చిరు వద్ద మినిమమ్ హిట్ అనే గ్యారెంటీ అయితే ఉంటుంది. అందుకే ఆయన ఎలాంటి రిస్క్ లేకుండా నాలుగు చిత్రాలను సేఫ్‌గా ప్లాన్ చేసుకున్నారు.