మెగాస్టార్ 150వ సినిమా కబురు ఈ ఏడాది ఉండదా..?

Chiranjeevi-(11)

మెగాస్టార్ చిరంజీవి నటించబోయే 150వ సినిమా కబుర్లు ఈ ఏడాది వినిపించకపోవచ్చు అని ఫిల్మ్ నగర్ టాక్. తెలుగు చిత్రసీమలో అగ్ర దర్శకులు, రచయితలు చిరంజీవికి తమ కథలను వినిపించారు. వాటిలో రెండు స్టొరీ లైన్స్ సెలెక్ట్ చేశారని సమాచారం. అయితే ఫుల్ బౌండ్ స్క్రిప్ట్ రెడీ కాలేదట. స్క్రిప్ట్ రెడీ అయ్యేవరకు సినిమా గురించి ప్రకటించకూడదని నిర్ణయం తీసుకున్నారట.

తన మూడు దశాబ్దాల సినీ జీవితంలో ఈ 150వ సినిమా చిరస్మరణీయ సినిమాగా నిలవాలని చిరు భావిస్తున్నారు. అందుకే కథల ఎంపికలో చాలా జాగ్రత్త వహిస్తున్నారు. దర్శకుడు ఎవరు అని అంశంలో కూడా ఒక నిర్ణయం తీసుకోలేదు. వివి వినాయక్, కృష్ణవంశి తదితరుల పేర్లు వినిపించినా ఎవరూ కన్ఫర్మ్ కాలేదు. గతంలో ఈ ఏడాది చివరి కల్లా 150వ సినిమా గురించి ప్రకటిస్తామని రామ్ చరణ్ చెప్పారు. ఇప్పుడు ఆ పరిస్థితులు కనిపించడం లేదని ఫిల్మ్ నగర్ టాక్. వెయిట్ & సి ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్.

Exit mobile version