మెగా 154 లో స్పెషల్ ట్రాక్.. ఫ్యామిలీ ఆడియన్సే టార్గెట్ !

మెగా 154 లో స్పెషల్ ట్రాక్.. ఫ్యామిలీ ఆడియన్సే టార్గెట్ !

Published on Oct 23, 2022 7:28 PM IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా యంగ్ డైరెక్టర్ కె.ఎస్‌. రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో మెగా 154 ( వాల్తేరు వీరయ్య) అనే పవర్ ఫుల్ మాస్ ఎంటర్టైనర్ రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమాలో ఫ్యామిలీస్ కోసం ఓ ప్రత్యేక ట్రాక్ ను డిజైన్ చేశారట మేకర్స్. చిరంజీవికి రవితేజ సవతి తల్లి కొడుకు అట. ఇంటర్వల్ నుంచి ఈ రెండు పాత్రల మధ్య ఎమోషన్స్ అధ్భుతంగా ఉంటాయని.. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే విధంగా రవితేజ – చిరు మధ్య సీన్స్ ఉంటాయని తెలుస్తోంది.

అందుకే ఈ సినిమా పై మెగా ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక 2023 సంక్రాంతి రేసులో ఈ మెగా సినిమా ఉంది. మరోపక్క బాలయ్య సినిమా కూడా సంక్రాంతి రేసులో ఉంది. ఈ రెండు సినిమాలను మైత్రీ మూవీ మేకర్స్ భారీ ఎత్తున నిర్మిస్తోంది. మెగా 154 సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు