పవన్ కళ్యాణ్ సినిమాలో చిరంజీవి విలన్ !

tarun-arora
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా నటిస్తున్న ‘కాటమరాయుడు’ చిత్రం పొలాచ్చిలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. రాయలసీమ నైపథ్యంలో నడిచే ఈ రొమాంటిక్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్లో పవన్ కళ్యాణ్ ఓ పవర్ ఫుల్ రోల్ లో కనిపించనున్నాడు. అంత శక్తివంతమైన పాత్రలో కనిపించే పవన్ కళ్యాణ్ కు విలన్ గా ఎవరైతే బాగుంటుందని ఆలోచించిన దర్శకుడు డాలి చాలా మందిని పరిశీలించి చివరికి కొత్త నటుడు తరుణ్ అరోరాను ఫైనల్ చేసినట్టు సినీ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి.

బాలీవుడ్ నటుడైన తరుణ్ అరోరా తమిళ చిత్రం ‘కనిథన్’ తో బాగా పాపులరయ్యాడు. ప్రస్తుతం ఇతను టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న ప్రతిష్టాత్మక 150వ చిత్రం ‘ఖైదీ నెం 150’ లో కూడా విలన్ గా నటించి అందరి దృష్టినీ ఆకర్షించాడు. కాటమరాయుడులో ఇతని పాత్రను డాలి చాలా బాగా డిజైన్ చేశాడని, అతనికి పవన్ కళ్యాణ్ కు మధ్య నడిచే సన్నివేశాలు చాలా పవర్ ఫుల్ గా ఉంటాయని తెలుస్తోంది. ఇకపోతే ఈ చిత్రంలో ప్రముఖ నటుడు రావు రమేష్ కూడా ఒక ప్రత్యేకమైన నెగెటివ్ పాత్రలో కనిపించనున్నాడు. తమిళ ‘వీరమ్’కు రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా శివ బాలాజీ, కమల్ కామరాజ్, అజయ్, చైతన్య కృష్ణలు పవన్ తమ్ముళ్లుగా కనిపించనున్నారు.