రేపటి నుండి చిరు 150వ సినిమా రెండవ షెడ్యూల్ ప్రారంభం

chiranjeevi-2
మెగాస్టార్ చిరంజీవి 150 వ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. చాలా ఏళ్ల తరువాత చిరంజీవి చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో, మెగా అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. దీంతో చిరంజీవి సినిమాకు సంబందించిన ప్రతి చిన్న విషయంలోనూ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం రెండవ షెడ్యూల్ రేపటిమ నుండి హైదరాబాద్ లో మొదలుకానుంది.

ఇప్పటికే సినిమాలో ముఖ్యమైన జైలు సన్నివేశాల్ని మొదటి షెడ్యూల్లో పూర్తి చేశారు దర్శకుడు వివి. వినాయక్. ఈ చిత్రం రైతుల సమస్యలపై పోరాడేదిగా ఉంటుంది కాబట్టి ముఖ్యమైన సన్నివేశాలకు ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా బలమైన డైలాగులు రాస్తున్నారు. ఇకపోతే ఈ చిత్రాన్ని 2017 సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.