చిరు 151వ సినిమా ప్రీ ప్రొడక్షన్ మొదలైంది..!

chiru
‘ఖైదీ నంబర్ 150’ అనే సినిమాతో మెగాస్టార్ చిరంజీవి సినీ పరిశ్రమకు గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. తొమ్మిదేళ్ళ తర్వాత వచ్చినా కూడా బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపిస్తూ ఖైదీ చిరంజీవి స్టామినాను ప్రపంచానికి చాటిచెప్పింది. ఇక ఈ సినిమా ఇలా థియేటర్లలో సందడి చేస్తూండగానే అప్పుడే చిరు తన కొత్త సినిమాకు సంబంధించిన పనుల్లో పడిపోయారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కనున్న చిరు 151వ సినిమాను రామ్ చరణ్ నిర్మించనున్నారు. ఖైదీతో నిర్మాతగా మంచి పేరు సంపాదించుకున్న చరణ్ వెంటనే మళ్ళీ తన తండ్రి సినిమానే నిర్మిస్తుండడం విశేషంగా చెప్పుకోవాలి.

ఇక మార్చిలో ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్ళాలని టీమ్ భావిస్తోందట. ప్రస్తుతం సీనియర్ రైటర్స్ అయిన పరుచూరి బ్రదర్స్‌తో కలిసి సురేందర్ రెడ్డి స్క్రిప్ట్ పనుల్లో పడిపోయారు. చిరంజీవి ఖైదీ నంబర్ 150కి కూడా పరుచూరి బ్రదర్స్ రచయితలుగా పనిచేశారు. చిరు ఇమేజ్‌కు సరిపడే ఓ మాస్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారట.