కేరళకు ‘మెగా’ సాయం !

వర్షాలతో అతలాకుతలం అవుతున్న దక్షిణాది రాష్ట్రం కేరళలో పరిస్థితీ చాలా దారుణంగా వుంది. 100 సంవత్సరాలలోఇలాంటి విపత్తును ఎప్పుడు ఎదుర్కొని కేరళకు కేంద్రం అండగా నిలుస్తుంది. 500కోట్ల రూపాయలను జాతీయ విపత్తు కింద కేరళకు ప్రకటించింది. ఇక అటు సినీ ప్రముఖలనుండి కూడా ముఖ్య మంత్రి సహాయ నిధికి భారీగా విరాళాలు అందుతున్నాయి. దాంట్లో భాగంగా టాలీవుడ్ నుండి మెగాస్టార్ చిరంజీవి ఆయన ఫ్యామిలీ కలిసి విరాళాలను ప్రకటించారు.

చిరంజీవి రూ.25 లక్షలు, చరణ్ రూ.25లక్షలు , ఉపాసన రూ.10 లక్షల విలువజేసే మెడిసిన్స్ ను అలాగే చిరంజీవి తల్లి అంజనాదేవి లక్ష రూపాయలను డొనేట్ చేశారు. ఇక వీరు మాత్రమే కాకుండా పలువురు హీరోలు, హీరోయిన్లు తమ వంతు సహాయంగా విరాళాలను అందజేస్తున్నారు