‘చిరంజీవి’ కోసం పూజలు చేస్తున్న కుటుంబ సభ్యులకు

chiranjeevi
ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కడ చూసినా ‘మెగాస్టార్ చిరంజీవి’ 150వ చిత్రం గురించే చర్చలు నడుస్తున్నాయి. అటు అభిమానుల్లోనూ, ఇటు సినీ జనాల్లోనూ ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. పైగా ఆగష్టు 22 చిరు పుట్టినరోజునాడు చిత్రం తాలూకు ఫస్ట్ లుక్ ను విడుదల చేస్తుండటంతో అభిమానుల్లో కోలాహలం రెట్టింపయింది. ఈ సందర్బంగా మెగా అభిమానులు తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల ‘నవ జన్మ పూజ మహోత్సవాలు’ పేరుతో పూజలు, వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

మరోవైపు చిరంజీవి కుటుంబ సభ్యులు సైతం చిరు రీ ఎంట్రీ గ్రాండ్ సక్సెస్ కావాలని, ఫస్ట్ లుక్ కి మంచి స్పందన రావాలని పలు పుణ్య క్షేత్రాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నిన్న అంతర్వేదిలో ‘ధరమ్ తేజ్’ పూజలు చేయగా ఈరోజు చిరు కుటుంబ సభ్యులు శ్రీకాకుళంలోని రాజరాజేశ్వరీదేవి ఆలయంలో రుద్రాభిషేకాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి కూడా పాల్గొన్నారు. ‘వివి వినాయక్’ దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ 2017 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.