మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నయనతార హీరోయిన్ గా దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ సినిమా కోసం అందరికీ తెలిసిందే. మరి చిరు నుంచి చాలా కాలంగా మిస్ అవుతున్న కామెడీ యాంగిల్ ని ఫుల్ ఫ్లెడ్జ్ గా చూపిస్తూ చేస్తున్న సినిమానే ఇది కాగా ఈ సినిమా షూటింగ్ రీసెంట్ గానే మొదలైంది. ఇలా మొదటి షెడ్యూల్ ని స్టార్ట్ చేసుకున్న సినిమా సూపర్ స్పీడ్ లో ఈ షెడ్యూల్ ని ఆల్రెడీ కంప్లీట్ చేసేసిందట.
ఇంకా ఒక రోజు ముందే షెడ్యూల్ ని అనీల్ అండ్ టీం ప్యాకప్ చెప్పినట్టుగా టాక్. ఇలా మొత్తానికి మాత్రమే అనీల్ రావిపూడి అండ్ టీం మెగాస్టార్ సినిమాకి పర్ఫెక్ట్ వర్క్ ని అందిస్తున్నారని చెప్పొచ్చు. ఇక ఇదిలా ఉండగా దీనితో పాటుగా రెండో షెడ్యూల్ కి కూడా రంగం సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి మాత్రం వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఎట్టి పరిస్థితుల్లో ఈ చిత్రం రావచ్చని చెప్పవచ్చు.
