“ఆచార్య” కి తన పార్ట్ కంప్లీట్ చేసుకున్న మెగాస్టార్.?

Published on Sep 18, 2021 3:00 pm IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో “ఆచార్య” అనే భారీ బడ్జెట్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రం ఇప్పుడు సాంగ్స్ చిత్రీకరణలో ఉన్న సంగతి కూడా తెలిసిందే. మరి ఇదిలా ఉండగా ఈ సినిమా కి సంబంధించి మెగాస్టార్ పై షూట్ అంతా కంప్లీట్ అయ్యినట్టుగా సినీ వర్గాలు చెబుతున్నాయి.

అలాగే రీసెంట్ గానే మెగాస్టార్ చరణ్ లపై ఒక సాంగ్ కంప్లీట్ అయ్యినట్టుగా కూడా తెలిసింది. ఇంకా చరణ్ పై కొన్ని ప్యాచ్ వర్క్స్ మాత్రమే బ్యాలన్స్ ఉన్నాయని తెలుస్తుంది. ఇక ఈ చిత్రంలో పూజా హెగ్డే మరో హీరోయిన్ గా నటించగా మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. అలాగే మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

సంబంధిత సమాచారం :