డూప్స్ వాడటానికి ఒప్పుకొని చిరంజీవి !

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘సైరా’ చిత్ర షూటింగ్ గత డిసెంబర్లో మొదటి షెడ్యూల్ ను ముగించుకుని రెండవ షెడ్యూల్ కు సిద్ధమవుతోంది. ఈ నైపథ్యంలో సినిమా గురించిన రకరకాల వార్తలు బయటికొచ్చాయి. వాటిలో కొన్ని పుకార్లు కాగా ఇంకొన్ని ఆసక్తికరమైన వాస్తవాలు ఉన్నాయి. షూటింగ్ సమయంలో నరసింహారెడ్డి పాత్ర కోసం చిరంజీవిగారికి వేసే మేకప్ కు సుమారు 2, 3 గంటల సమయం పడుతోందట.

అందుకే దర్శకుడు సురేందర్ రెడ్డి చిన్న చిన్న సన్నివేశాలకు కూడా గంటల తరబడి మేకప్ వేసి చిరును ఇబ్బందిపెట్టడం ఇష్టంలేక కొన్ని సీన్స్ కు డూప్స్ ను ఉపయోగిద్దామనే సలహా ఇచ్చారట. కానీ చిరు మాత్రం అందుకు ఒప్పుకోలేదట. అలా చేస్తే పాత్రలో తన బాడీ లాంగ్వేజ్, స్టైల్ మిస్సవుతుందని అన్నారట. దీన్నిబట్టి చిరు కమిట్మెంట్, డెడికేషన్ ఎలాంటివో అర్థమవుతుంది.