మరోసారి తన భాద్యతను నిర్వర్తించిన చిరంజీవి !

మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన సహృదయాన్ని చాటుకున్నారు. పరిశ్రమ పట్ల, సీనియర్ ఆర్టిస్టుల పట్ల తనకెటువంటి భాద్యత ఉందో చూపించారు. సీనియర్ నటుడు, కమెడియన్ పొట్టి వీరయ్య గత కొన్నాళ్లుగా ఆనారోగ్యంతో భాదపడుతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న చిరు వైద్య ఖర్చుల నిమిత్తం ఆయనకు రూ.2 లక్షల రూపాయల సహాయాన్ని అందించారు.

అంతేగాక కొద్దిరోజుల క్రితమే కాదంబరి కిరణ్ యొక్క ‘మనం సైతం’ కు కూడా రూ. 2 లక్షల విరాళాన్ని అందించారు చిరు. ప్రస్తుతం ఈయన తన 151వ సినిమా ‘సైరా నరసింహారెడ్డి’ షూటింగ్లో పాల్గొంటున్నారు. ఈ చిత్రాన్ని స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తుండగా రామ్ చరణ్ నిర్మిస్తున్నారు.