టాక్..ఈ మాస్ డైరెక్టర్ కి చిరు గ్రీన్ సిగ్నల్.?

Published on Feb 22, 2023 7:46 pm IST

ప్రస్తుతం మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు మెహర్ రమేష్ తో “భోళా శంకర్” అనే ఓ సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక దీనికి ముందు అయితే మెగాస్టార్ “వాల్తేరు వీరయ్య” తో సెన్సేషనల్ హిట్ కొట్టి మళ్ళీ తన ట్రాక్ లోకి వచ్చేసారు. దీనితో ఇక నెక్స్ట్ తన లైనప్ పై మరింత హైప్ స్టార్ట్ కాగా ఇప్పుడు ఓ మాస్ డైరెక్టర్ అయితే చిరు లైనప్ లో మళ్ళీ వచ్చినట్టుగా తెలుస్తుంది.

ఆ దర్శకుడు ఎవరో కూడా కాదట. చిరు తో మంచి హిట్ ట్రాక్ ఉన్నటువంటి సీనియర్ దర్శకుడు వివి వినాయక్ అట. మాస్ లో వినాయక్ కి సెపరేట్ ట్రాక్ ఉంది. మరి ఈ కాంబినేషన్ లో సినిమా ఉండొచ్చని ఇప్పుడు రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి దీనిపై మరింత క్లారిటీ అయితే రావాల్సి ఉంది. అలాగే వీరి కాంబో నుంచి డైరెక్ట్ ప్రాజెక్ట్ వస్తుందా లేక మళ్ళీ రీమేక్ తో వస్తారా అనేది కూడా కాలమే నిర్ణయించాలి.

సంబంధిత సమాచారం :