యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో బిజీగా ఉన్న ‘చిరంజీవి’

chiranjeevi
మెగాస్టార్ ‘చిరంజీవి’ 150వ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతున్నా సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం హైదరాబాద్ శివార్లలోని నానకరామ్ గూడలో వేసిన సెట్టింగ్ లో హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణనను జరుపుకుంటోంది. సినిమా ఇంటర్వెల్ సన్నివేశంలో వచ్చే ఈ యాక్షన్ సన్నివేశాలను -ప్రముఖ ఫైట్ మాస్టర్స్ ‘రామ్ – లక్ష్మణ్’ లు రూపొందిస్తున్నారు.

తమిళ ‘కత్తి’కి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరు సరసన ‘కాజల్ అగార్వల్’ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం తాలూకు ఫస్ట్ లుక్ ను ఆగష్టు 22న చిరంజీవి పుట్టినరోజు సందర్బంగా విడుదల చేస్తున్నారు. ‘వి.వి. వినాయక్’ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ‘దేవి శ్రీ’ సంగీతం అందిస్తుండగా ‘రామ్ చరణ్’ స్వయంగా నిర్మాణ బాధ్యతలను నిర్వహిస్తున్నారు.